

పెళ్లి సందడి తో హీరోయిన్ గా పరిచయం అయినా శ్రీ లీల మంచి జోరు మీదుంది. ధమాకా సినిమా సక్సెస్ ఈ అమ్మాయి క్రేజ్ ను డబల్ చేసింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆమెలో ఉన్న మంచి డ్యాన్సింగ్ టాలెంట్ తో పాటు తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్ ల కొరత కూడా ఆమెకు బాగా చేతికి అందివచ్చింది.
ఈ బెంగళూరు అమ్మాయి మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా తో పాటు నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణ కూతురుగాను, పంజా వైష్ణవ తేజ్ సరసన సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాలోనూ నటిస్తూ ఉంది. నితిన్ సరసన కూడా ఈ అమ్మాయి ఒక సినిమా లో నటిస్తోంది.
ఇవే కాకుండా ఇప్పుడు శ్రీ లీల పవన్ కళ్యాణ్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వం లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇక శ్రీ లీల నెక్స్ట్ టాప్ స్టార్ అని చెప్పుకోవచ్చు.
Leave a Reply