

RRR సినిమా ఎంత సంచలనం సృష్టించిందో, అంత కంటే ఆ సినిమాలోని నాటు నాటు పాట సంచలనం సృష్టించిందన్న విషయం మనందరికీ తెలిసినదే. గోల్డెన్ గ్లోబ్ అవార్డు తేలుచుకున్న ఈ పాట ఇప్పుడు ఆస్కార్ కు నామినేట్ అయి అందరిలో ఆసక్తి పెంచుతోంది.
ఈ చిత్ర కథానాయకులలో ఒకరైన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆస్కార్ అవార్డు దగ్గరకొస్తున్న రోజుల్లో అమెరికా లో పర్యటిస్తూ వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉన్నారు. అలాంటి ఒక ఇంటర్వ్యూ లో రిక్వెస్ట్ వస్తే ఆస్కార్ స్టేజి పై ఎన్టీఆర్ తో పాటు నాటు నాటు పర్ ఫార్మ్ చేసేందుకు తాను సిద్ధం అని చెప్పారు. ప్రేక్షకులకు అలరించడం తమకెప్పుడు ఆనందమేనని కాకపోతే, స్టేజి పై మొత్తం పాటను పర్ ఫార్మ్ చెయ్యలేకపోవచ్చని ఆయన తెలిపారు.
“ రిక్వెస్ట్ ఉండి మరియు ప్రిపేర్ కావడానికి సమయం ఉంటే మేము ఆస్కార్‌లతో సహా ఎక్కడైనా నాటు నాటు చేయడానికి ఇష్టపడతాము, అయితే, వేదికపై పూర్తి పాట చేయడానికి చాలా శక్తి అవుతుంది. కానీ ఖచ్చితంగా హుక్ స్టెప్ వేసేందుకు మేము సిద్ధం, ”అని ఆయన చెప్పారు.
అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు ఆస్కార్ స్టేజి పై పర్ ఫార్మ్ చేయకపోవచ్చు కానీ, ఈ పాట పాడిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ ఆస్కార్స్‌లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ అవార్డు గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో పాటు టీమ్ మొత్తం కూడా ఈ ఈవెంట్‌కి హాజరవుతున్నారు.
Leave a Reply