

మాజీ మిస్ యూనివర్స్ మరియు బాలీవుడ్ నటి సుస్మిత సేన్ గుండెపోటు కు గురయ్యి ఇప్పుడు కోలుకుంటున్నారు. ఈ వార్త ఆమె సోషల్ మీడియా లో అభిమానులకు తెలుపడంతో అందరు షాక్ కి గురయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఆమె ఇలా రాసారు , “మీ హృదయాన్ని సంతోషంగా & ధైర్యంగా ఉంచుకోండి, మీకు అవసరమైనప్పుడు అది మీకు అండగా నిలుస్తుంది” (నా తండ్రి @sensubir తెలివైన మాటలు) నేను కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో బాధపడ్డాను. యాంజియోప్లాస్టీ చేశారు. స్టెంట్ వేయడం జరిగింది మరియు ముఖ్యంగా, నా కార్డియాలజిస్ట్ ‘నాకు బిగ్ హార్ట్ ఉంది’ అని మళ్ళీ కంఫర్మ్ చేశారు. చాలా మంది వ్యక్తులు చేసిన తమ సమయానుకూల సహాయం మరియు నిర్మాణాత్మక చర్యకు ధన్యవాదాలు మరొక పోస్ట్‌లో తెలుపుతాను! ఈ పోస్ట్ కేవలం మీకు (నా శ్రేయోభిలాషులు & ప్రియమైన వారికి) శుభవార్త తెలియజేయడం కోసమే. అంతా బాగానే ఉంది & నేను మళ్ళీ కొంత జీవితానికి సిద్ధంగా ఉన్నాను!!! నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను!!!! “

Leave a Reply