
ప్రముఖ రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అయినా శ్రీమతి సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు 76 ఏళ్ళు . సర్ గంగారాం ఆసుపత్రిలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. సోనియా గాంధీ గురువారం నాడు అడ్మిట్ అయ్యారని, ఆమెకు కొన్ని పరీక్షలు నిర్వహించారని సమాచారం.
ఆమె పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మరియు సోనియా గాంధీ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె పరిస్థితి సీరియస్ గా లేదని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఆమెకు జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే జ్వరం రావడానికి గల కారణాలపై ఎలాంటి సమాచారం లేదు. సోనియా గాంధీ అబ్జర్వేషన్‌లో ఉన్నారు మరియు ఆమె ఆహారం తీసుకుంటున్నట్లు మరియు ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సోనియా గాంధీ ఇంటెన్సివ్ కేర్ లో లేరని, అందరితో మాట్లాడుతున్నారని మరియు చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Leave a Reply